Purandeshwari :విశాఖ ఉక్కు ఉద్యోగుల సమస్య పరిష్కరించండి : పురందేశ్వరి

విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల జీతాల సమస్య పరిష్కరించాలని బీజేపీ(BJP) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy)కి విజ్ఞప్తి చేశారు. భారతీయ మజ్దూర్‌సంఫ్‌ు నాయకులతో కలిసి ఆమె ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ(Srinivasa Varma )లతో సమావేశమయ్యారు. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు పెండిరగ్‌లో ఉన్నాయని, దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై మజ్దూర్ సంఫ్‌ు వినతిపత్రాన్ని వారికి సమర్పించారు.