Yoga Andhra: ఎక్కడారాని అనుభూతి విశాఖలో వచ్చింది : మోదీ

11 ఏళ్లుగా అనేక చోట్ల యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నా, కానీ, ఎక్కడారాని అనుభూతి యోగా డే రోజు విశాఖలో వచ్చింది అని ప్రధాని మోదీ (Prime Minister Modi) అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర (Yoga Andhra)పై మాట్లాడారు. యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) , మంత్రి లోకేశ్ (Minister Lokesh) ను మెచ్చుకున్నారు. యోగాంధ్ర నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఏపీని కోరినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక మిగతా రాష్ట్రాలకు పంపించి స్టడీ చేయాలని చెబుతామన్నారు.యోగాంధ్ర విజయాన్ని అందరూ కేస్ స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.