Modi: బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి : మోదీ
సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పుట్టపర్తి (Puttaparthi) లో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు మోదీ హాజరై మాట్లాడారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి (Sathya Sai)జీవించారు. భౌతికంగా బాబా లేకున్నా, ఆయన ప్రేమ మనతోనే ఉంది. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయి. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు ఇదే ఆయన నినాదం. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారు. లక్షల మందిని సేవామార్గంలో నడిపించారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు, వైద్యం, విద్య (Education) వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉంది. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్ధిల్లాలి అని మోదీ అన్నారు.






