Pawan Kalyan: డెవెలప్మెంట్ లో పవన్ మార్క్.. ప్రభావం చూపుతున్న ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalayan) పనితీరుపై ఇప్పుడు ప్రశంసలు వినపడుతున్నాయి. సామాన్య ప్రజల్లో పవన్ కళ్యాణ్ మంచి ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడు పై ప్రజల్లో సానుకూల అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగా కనపడుతున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో డోలి సమస్యలకు ముగింపు పలికే విధంగా కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు నిర్మించే విధంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ నేరుగా జోక్యం చేసుకోవడంతో అధికారులు కూడా పనులను వేగవంతం చేస్తున్నారు. ఇటీవల పెనమలూరు నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకమవుతున్న పద్ధతి కూడా సామాన్య ప్రజలకు నచ్చుతుంది. ఇక గుడివాడ (Gudivada) నియోజకవర్గంలో తాగునీటి సమస్య విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనుసరించిన వైఖరి పై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. 44 గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉండటంతో వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనితో అక్కడ తాగునీటి సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో కడప నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇటీవల పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేశారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ప్రజలకు పవన్ కళ్యాణ్ చేరవు కావడంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అటు జనసేన (Janasena) పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ దూకుడు చూసి హుషారుగా కనపడుతున్నారు.






