MSG: యూఎస్ లో చిరూ రికార్డు
చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మన శంకరవరప్రసాద్ గారు(Mana ShankaraVaraprasad Garu). సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్- చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు వేయగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. అన్ని వర్గాల నుంచి సినిమాకు ఆదరణ దక్కడంతో పాటూ మరోసారి అనిల్ ఆడియన్స్ ను తనదైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో మెప్పించాడని అంటున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి ఎఫెక్ట్ ను చూపించింది మన శంకరవరప్రసాద్ గారు(MSG).
ఈ సినిమా యూఎస్ లో 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ గ్రాస్ మార్క్ ను దాటి చిరూ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచింది. నార్త్ అమెరికాలో చిరంజీవి ఈ రికార్డును సాధించడం రెండో సారి కావడం విశేషం. సీనియర్ హీరోల్లో ఈ రికార్డును సాధించిన వారు కేవలం చిరంజీవి మాత్రమే. నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్(venkatesh) ఓ స్పెషల్ రోల్ చేశారు.






