Tirumala: మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
చంద్ర గ్రహణం (Lunar eclipse) కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుంచి రాత్రి 7.30 వరకు తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఆ రోజు మద్యాహ్నం 3.20 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.47కు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా తలుపులు మూసివేయడం ఆనవాయితీ. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం 8.30 గంటల నుంచి దర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. గ్రహణం కారణంగా అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.






