కేఆర్ ఎంబీ కీలక నిర్ణయం..

తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.