జై జగన్ నినాదాలతో మారుమోగిన లండన్..
ఆంధ్ర సీఎం జగన్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కుటుంబంతో కలిసి హాలిడేస్ గడపడానికి లండన్ చేరుకున్నారు. ఎందరో నేతలు విదేశీ ప్రయాణం చేస్తూ ఉంటారు.. కానీ వారికి ఎవరికీ దక్కని అరుదైన ఆదరణ.. జగన్ కు దక్కింది. సొంత దేశంలోనే కాదు పరాయి దేశంలో కూడా జగన్ అడుగుపెట్టిన వెంటనే జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్ పోర్టులో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జగన్ ను చూసి.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తనకు అందుతున్న ఆదరణ చూసి జగన్ చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అభివాదం చేశారు. లండన్ పర్యటనకు సీఎం బయలుదేరుతున్న సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టు లో తుళ్లూరు లోకేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ..ఎవరికో కొన్ని మెసేజ్ లు పంపినట్లు అధికారులు గుర్తించారు. దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా అతను గుండెపోటు వచ్చినట్టు కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అతని ఆసుపత్రిలో చేర్చామని అధికారులు వెల్లడిస్తున్నారు. తుళ్లూరు లోకేష్ అనే ఈ వ్యక్తి ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పసుపు దళానికి ఫేవర్ గా మాట్లాడారు. ఇంకా అతని గురించి నా పూర్తి వివరాలు వెల్లడించలేదు.






