TTD: టీటీడీకి తమ ఇంటిని విరాళంగా ఇచ్చిన దంపతులు

ఇటీవల మృతి చెందిన మాజీ ఐఆర్‌ఎస్ అధికారి భాస్కర్‌రావు (Bhaskar Rao) స్పూర్తితో హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ ఇంటిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdhury ) కి సంబంధిత పత్రాలను అందజేశారు. మల్కాజ్‌గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి.కనకదుర్గ ప్రసాద్ (Kanakadurga Prasad) , సునీతా దేవి (Sunita Devi ) దంపతులు వారికి సంతానం లేదు. తమ తదనంతరం రూ.18.75 లక్షల విలువైన 250 గజాల ఇల్లు శ్రీవారికి చెందేలా వీలునామా రాసి స్వామిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. స్వామివారిపై అపారమైన భక్తితో ఇంటిని విరాళంగా ఇవ్వడం ఇతర భక్తులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని వెంకయ్య చౌదరి అన్నారు. టి.కనకదుర్గ ప్రసాద్, సునీతా దేవి దంపతులను ఆయన అభినందించారు.