Pawan Kalyan: ఢిల్లీ సమావేశంలో చంద్రబాబు ప్లేస్ లో పవన్..అసలు రీసన్ ఇదే..

ఢిల్లీలో (Delhi) ఆదివారం జరిగిన ముఖ్యమైన సమావేశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షత వహించారు. ఇందులో ఎన్డీఏ (NDA) పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గైర్హాజరవగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం హాజరయ్యారు. అయితే దీని పై సోషల్ మీడియా వేదికగా చాలా చర్చలు సాగుతున్నాయి.
గత రెండు రోజులుగా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ, ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి మాత్రం రాలేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఆయన ఎందుకు రాలేదన్నది అధికారికంగా వెల్లడించలేదు కానీ, కుప్పం (Kuppam) నియోజకవర్గంలో తన నివాస గృహ ప్రవేశ కార్యక్రమం ఉండడంతో ముందుగానే కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా చంద్రబాబు తప్పుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఆయన హాజరు ఒక విధంగా ప్రధాని మోదీ ప్రభుత్వానికి బలాన్ని గుర్తు చేసింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లే బీజేపీ (BJP) తెలుగుదేశంతో చేతులు కలిపింది. దాంతో, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని విజయాలు లభించాయి. ఈ విజయాలతో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేలా మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో పవన్ హాజరు ఒక శక్తివంతమైన గుర్తుగా కనిపించింది.
ఈ సమావేశం ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) అనంతర సమీక్షకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. పాకిస్థాన్ (Pakistan) తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై, యుద్ధం తర్వాత ఏర్పడే పరిస్థితులపై నేతలు చర్చించారు. సమావేశంలో రెండు కీలక తీర్మానాలు తీసుకునే అవకాశముంది. అందులో ఒకటి ఆపరేషన్ సింధూర్ పై అభినందన తీర్మానం కాగా, మరొకటి దేశవ్యాప్తంగా కుల గణన (caste census) నిర్వహించాలన్న ప్రతిపాదన. ఈ సమావేశానికి మొత్తం 20 మంది సీఎంలు, 18 మంది డిప్యూటీ సీఎంలు, మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఇలా కీలక సమావేశాల్లో పాల్గొనడం, రాష్ట్రానికి కేంద్రంలో ప్రాధాన్యం పెరుగుతున్న సూచనగా విశ్లేషణ జరుగుతోంది.