Devineni : దేవినేని కుమారుడి వివాహం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. నగర శివారు కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) , సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్ (Nihar), సాయి నర్మద (Sai Narmada) లను వారు ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్, మంత్రి నారా లోకేశ్ కలిసి వివాహ వేడుక వద్దకు వచ్చారు.