Sathya Sai: సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి : చంద్రబాబు
విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి (Sathya Sai) బాబా మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. పుట్టపర్తి (Puttaparthi)లో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవస్వరూపం ఆయనని కొనియాడారు. మానవసేవే మాధవసేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారు. ప్రపంచమంతా ప్రేమను పంచారు. విదేశాలకు వెళ్తే చాలా మంది ఆయన గురించి చెప్పేవారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు నెలకొల్పారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోంది. ట్రస్ట్‌కు 7 లక్షల మందికి పైగా వాలంటీర్లు (Volunteers) ఉన్నారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి. సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి అని అన్నారు.






