Chandrababu: ఆ విషయంలో నేను, పవన్ కల్యాణ్ రాజీపడం : సీఎం చంద్రబాబు
శాంతిభద్రతల విషయంలో నేను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్కడా రాజీపడం. మా పార్టీ నేతలు గానీ జనసేన నాయులు (Janasena leaders) గానీ నేరాలు చేయరు. చేసేవారికి సహకరించరు. మా తొలి ప్రాధాన్యం రాష్ట్ర భద్రతే అని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. కానిస్టేబుళ్లు (Constables)గా ఎంపికైనవారికి మంగళగిరిలో సీఎం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయం ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తాయారయ్యారని, వారిని వదిలేస్తే ప్రజలకు ఇబ్బందులొస్తాయని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీ నీడను కూడా మీరు నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో పోలీసుల (Police)కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. సమర్థులకు పెద్దపీట వేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను హెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. దీనికి శాంతిభద్రతలు చాలా ముఖ్యం. ఇందులో ఎలాంటి రాజీ లేదు. పోలీసులు పూర్తిగా సహకరించాలి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది. ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు.






