AP Govt: ఆ విమర్శలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు సర్కార్..?

సాధారణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తూ ఉంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవి. ప్రధానంగా అమ్మఒడి రైతు భరోసా వంటి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విపక్షాలు టార్గెట్ చేశాయి. అమ్మఒడి కార్యక్రమాన్ని అందరికీ అమలు చేస్తామని చెప్పి, కేవలం ఒకరికి మాత్రమే అమలు చేయడంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.
ఇక రైతు భరోసా విషయంలో కూడా ఇటువంటి విమర్శలు వచ్చాయి. అలాగే పలు కీలక సంక్షేమ కార్యక్రమాల్లో టిడిపి.. వైసిపిని టార్గెట్ చేసింది. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసిపికి ఆ అవకాశాలు రావడం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ముందు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు సర్కార్ వేగంగా అడుగులు వేస్తూ తల్లికి వందనం(Talliki Vandanam) అలాగే అన్నదాత సుఖీభవ(Annadaatha sukheebhava)తో పాటుగా తాజాగా మహిళలకు ఉచిత బస్సు(Free bus for women) ప్రయాణం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
అంతకుముందు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతామని, హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కీలక అడుగు వేశారు. 15000 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచింది. అయితే వీటి విషయంలో వైసీపీకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దాదాపుగా లబ్ధిదారులు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడంతో వైసిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయలేకపోతోంది. కొన్ని కీలక సంక్షేమ కార్యక్రమాల్లో సాధారణంగా లోపాలు ఉంటాయి.
కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో పక్క జాగ్రత్తగా వ్యవహరిస్తోంది తల్లికి వందనం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మహిళలకు ప్రయాణంలో ఎంత రాయితీ వచ్చిందో కూడా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ పై పేర్కొనడంతో వైసిపి ఆ విషయంలో విమర్శలు చేయలేక ఇబ్బంది పడుతోంది. అక్కడక్కడ విమర్శలు చేసినా సరే అవి ప్రజల్లోకి వెళ్ళటం లేదు అనే కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. అందుకే వైసిపి మాజీ ఎమ్మెల్యేలు గానీ మాజీ ఎంపీలు గాని ప్రస్తుత ప్రజాప్రతినిధులు గాని వారి నియోజకవర్గంలో కనీసం నిరసన కార్యక్రమాలు కూడా చేయడం లేదు అనే విమర్శలు ఆ పార్టీ కార్యకర్తలే చేయడం గమనార్హం.