పెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గోనెపల్లి చేరుకుని అక్కడి నుంచి వాహనంలో పెంచలకోన చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి ఉండవల్లి బయలుదేరారు. చంద్రబాబు వెంట ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణ, హేమలత, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.






