కొవిడ్ బాధితులకు ప్రవాసాంధ్రుడు…50 వేల డాలర్ల

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన మల్లెంపల్లి సుబ్బారావు కుమార్తె డాక్టర్ మణిమంజరి రవీంద్ర హనుమార అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‍డిగోలో స్థిరపడ్డారు. వారి కుమారుడు ఆర్య హనుమార 11వ గ్రేడ్ చదువుతున్నారు. భారత్‍లో కొవిడ్ పరిస్థితులను చూసి బాధితులకు తన వంతు చేయూత ఇవ్వాలనుకున్నారు. అందుకు తల్లిదండ్రులు కూడా సహకారం అందించడంతో లివ్ ఫర్ లాఫర్ సంస్థ సహకారం తీసుకొని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, మందుల కిట్లు అందించేందుకు ముందుకు వచ్చారు. అందుకోసం తాను దాచుకున్న 50 వేల డాలర్లు అందించారు. కృష్ణా జిల్లా నూజివీడు గిఫర్డ్ మెమోరియల్ కొవిడ్ ఆస్పత్రితో పాటు గుడివాడ, కైకలూరు, ముదినేపల్లి, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రులకు 56 కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, మందుల కిట్లను అందించినట్లు ఆర్య కుటుంబ సభ్యులు తెలిపారు.