Madurai : అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మదురై (Madurai)లోని అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని(Arulmigu Solaimalai Murugan Temple) సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అకీరానందన్ (Akira Nandan) తదితరులు ఉన్నారు.