ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు

జగన్ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలింగ్ కు కనీసం 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలను పాటించలేదని, అందుకే మళ్ళీ ఎన్నికలు పెట్టాలని సూచించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్ళనున్నట్లు సమాచారం.
సుప్రీం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిందని టీడీపీ, బీజేపీ నేతలు వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తొలుత సింగిల్ జడ్జి చేత విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తః మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్ళింది. ఈ బెంచ్ ఎన్నికలకు అనుమతి ఇచ్చింది. అయితే ఓట్ల లెక్కింపు మాత్రం చేయవద్దని ఆదేశించింది. ఆ తర్వాత పై విధంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.