Anand Mahindra: ఎస్క్రో విధానం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం : ఆనంద్ మహీంద్రా
పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెస్తున్న పాలసీలు, అవిశ్రాంతంగా చేస్తున్న కృషిని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కొనియాడారు. చంద్రబాబును తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. దేశంలో తొలిసారిగా పెట్టుబడిదారులకే నేరుగా రాయితీలు చెల్లించేందుకు రాష్ట్రంలో ఎస్క్రో (Escrow) విధానాన్ని తీసుకురానున్నట్లు విశాఖలో జరిగిన సీఐఐ (CII) సదస్సులో చంద్రబాబు ప్రకటించడం ఆయన దార్శనికతకు నిదర్శనమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.






