TTD : టీటీడీకి రూ.కోటి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) అన్నప్రసాదం ట్రస్టుకు తిరుపతికి చెందిన లక్కీ ఫర్‌యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్యపవన్ కుమార్ (Surya Pawan Kumar) రూ.1,00,10,116 విరాళంగా అందించారు. సోమవారం తిరుపతి(Tirupati) లో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వారు దాతను అభినందించారు.