నస్రల్లా హత్యతో రగులుతున్న హెజ్ బొల్లా.. బరిలోకి ప్రమాదకరమైన బ్లాక్ యూనిట్..?
హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లాను పక్కా సమాచారంతో దాడి చేసి చంపేసింది ఇజ్రాయెల్. పలుమార్లు , పలు ప్రయత్నాలు చేసిన ఇజ్రాయెల్ దళాలు.. ఎట్టకేలకు నస్రల్లాను మట్టుబెట్టడంలో సక్సెస్ అయ్యాయి. ఈదాడుల్లో నస్రల్లా కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే తమ చీఫ్, ఆరాధ్య దైవంలా భావించే నస్రల్లా మృతితో హెజ్ బొల్లా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. అయితే .. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాత్రం… హెజ్ బొల్లాను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.
హెజ్బొల్లా చీఫ్ హత్యతో …. ఇజ్రాయెల్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ తమపై దాడులు జరుగుతాయో అన్నభయంతో .. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.అయితే.. చీఫ్ హత్యతో రంగంలోకి అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ యూనిట్ .. రంగంలోకిదిగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూనిట్ 910.. షాడో యూనిట్ గా పిలిచే ఈ కోవర్ట్ విభాగం..ఇది వరకూ ఇజ్రాయెల్ బయట యూదులపై దాడులు చేసిన సందర్భాలున్నాయి. 32 ఏళ్ల క్రితం అప్పటి నాయకుడు అబ్బాస్ ముసావిని ఇజ్రాయిల్ చంపిన సమయంలోనే ఈ యూనిట్ ప్రతీకార చర్యలు చేపట్టింది.
హెజ్బొల్లా వద్ద ఉన్న అత్యంత ప్రమాదకర యూనిట్లలో ఇది ఒకటి. ఈ యూనిట్ కి తలాల్ హామీమా అలియాస్ అబు జాఫర్ నాయకత్వాన్ని వహిస్తున్నాడు. లెబానన్ దేశ బయట దాడులను ఈ యూనిట్ నిర్వహిస్తుంది. ఈ యూనిట్ కి ప్రపంచవ్యాప్తంగా టెర్రర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉందని సమాచారం. దీంతో వీలైనంత వేగంగా దాడులు చేస్తుంది. గతంలో యూనిట్ 910 …అమెరికాలోనే జెకెఎఫ్ ఎయిర్ పోర్టుపై దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. చివరి నిమిషంలో వారి కుట్ర భగ్నం అయింది. ఆ కేసులో అలీని అరెస్టు చేయడంతో అమెరికాపై హెజ్ బొల్లా చేసిన కుట్ర బయటికి వచ్చింది.






