ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా ఉమెన్స్ ఫోరం

తానా ఉమెన్స్ ఫోరం

తానా కాన్ఫరెన్స్‌లో మహిళల కోసం ప్రత్యేక కారక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళలు మానసికంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు అవసరమైన సూచనలు, రాజకీయాల్లో మహిళల పాత్ర, భావోద్వేగాల అదుపు, హృదయ సంబంధమైన వ్యాధులు, తగిన జాగ్రత్తలు, ఆర్ట్స్‌, యోగా, భాష, సాహిత్యం వంటి రంగాల్లో, న్యాయ, కుటుంబ సంబంధమైన వివాదాల్లో అవగాహన, ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వంటి విషయాలపై ఇందులో చర్చించను న్నారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ మహిళా కార్యక్రమాలు ప్రారంభమవు తాయి. సెలబ్రిటీస్‌లో సెల్ఫీ కార్యక్రమం, రాఫెల్స్‌ తరువాత చర్చా కార్యక్రమాలు, ప్రసంగాలు ఉంటాయి. ఉమెన్‌ వెల్‌నెస్‌ కార్యక్రమంపై విజయ నాదెళ్ళ, కిరణ్‌ మంతెన, సుధ పురిహెళ్ళి, రేఖ ఉప్పులూరి ప్రసంగించనున్నారు. లీడర్‌షిప్‌ కార్యక్రమంపై సుజ్వల పుట్టగుంట, శ్రీలక్ష్మీ కులకర్ణి, స్పీడ్‌ నెట్‌వర్కింగ్‌ ఫర్‌ యంగ్‌ ప్రొఫెషనల్‌ అంశంపై రక్ష పోతగ్రడ మాట్లాడనున్నారు. టీన్స్‌లో అడిక్షన్‌పై రక్ష పోతాగ్రడ, సుప్రియామాకం ప్రసంగిస్తారు. తరువాత సాయంత్రం 5 గంటలకు సెలబ్రిటీస్‌తో సెల్ఫీ కార్యక్రమం, రఫెల్స్‌ కార్యక్రమం ఉంటుంది.

శనివారంనాటి కార్యక్రమంలో డయాబెటిస్‌, న్యూట్రిషన్‌ అంశంపై సుచిత్ర నంచెర్ల, నాధన్‌, ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ టెక్నాలజీపై లావణ్య ఎండూరి, హరిత మందుల, పద్మిని నదుమోలు, కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అంశంపై ప్రేమచత్రతి, డా. కల్పన తమ్మినేని, డా. కళ్యాణి నండూరి, శ్రీలేఖ పల్లె మాట్లాడుతారు. మధ్యాహ్నం ఇమ్మిగ్రేషన్‌ అంశంపై జనేత కలవల, చంద్రిక వల్లేరి, యువతకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న అంశంపై వింధ్య అడప, వైద్య సంబంధమైన విషయాలపై డా. సునీత పోలేపల్లె, శ్రీలేఖ పల్లె ప్రసంగిస్తారు.

 

Tags :