ASBL NSL Infratech

మెగా ఆఫ‌ర్ ప‌ట్టేసిన బాబీ డియోల్

మెగా ఆఫ‌ర్ ప‌ట్టేసిన బాబీ డియోల్

కెరీర్ ట్ర‌బుల్స్ లో ఉన్న ఎంతోమందికి యానిమల్ సినిమా మంచి లైఫ్ ను ఇచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలో విల‌న్ గా న‌టించిన బాబీ డియోల్ కు మంచి బ్రేక్ ద‌క్కింది. అబ్రార్ అనే క్యారెక్ట‌ర్ లో ఎంతో క్రూరుడిగా న‌టించి అంద‌రితో మంచి మార్కులేయించుకున్నాడు బాబీ. దీంతో అంద‌రూ డియోల్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటూ అత‌నికి స్వాగ‌తం ప‌లికారు.

ఆ సినిమా త‌ర్వాత బాబీకి సౌత్ లో వ‌రుస‌గా ఛాన్సులొచ్చాయి. మొద‌ట సూర్య సినిమా కంగువలో విల‌న్ క్యారెక్ట‌ర్ కొట్టేశాడు బాబీ. బాబీ కంగువలో విల‌న్ పాత్ర చేస్తున్నాడు. ఆ సినిమాలో బాబీ లుక్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాబీ- బాల‌య్య కాంబోలో తెర‌కెక్కుతున్న ఎన్‌బీకే109 లో కూడా బాబీ ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది.

ఇప్పుడు బాబీకి మ‌రో మెగా ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాలో బాబీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అయితే ఈసారి బాబీ చేస్తుంది విల‌న్ పాత్ర కాదు. చర‌ణ్ కు మెంట‌ర్ గా బాబీ ఈ సినిమాలో క‌నిపిస్తాడ‌ట‌. ఆ పాత్ర‌లో డెప్త్ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటుంద‌ని, బాబీకి మంచి పేరు తెస్తుంద‌ని చెప్తున్నారు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :