ASBL NSL Infratech

రిస్క్ చేస్తున్న స‌మంత‌

రిస్క్ చేస్తున్న స‌మంత‌

పుట్టిన రోజు సంద‌ర్భంగా సమంత త‌న ఫ్యాన్స్ కు ఊహించని షాకే ఇచ్చింది. మా ఇంటి బంగారం పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసింది స‌మంత‌. ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పిన స‌మంత ఆ బ్యాన‌ర్ లోనే ఈ సినిమాను నిర్మిస్తుంది. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని ఇల్లాలి లుక్ లో రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో స‌మంత చాలా కొత్త‌గా క‌నిపిస్తుంది.

ఇదిలా ఉంటే పోస్ట‌ర్ అయితే రిలీజ్ చేశారు కానీ దానికి డైరెక్ట‌రెవ‌రు?  మిగిలిన నిర్మాత‌లెవ‌రు అన్న‌ది మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. క‌నీసం డైరెక్ట‌ర్ పేరును కూడా చెప్ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఇదిలా ఉంటే పెద్ద పెద్ద నిర్మాత‌లే డిజిట‌ల్ రైట్స్ వ‌ల్ల దెబ్బ తిని ఇబ్బందులు ప‌డుతున్న ఇలాంటి టైమ్ లో స‌మంత ప్రొడ‌క్ష‌న్ లోకి దిగాల్సిన అవ‌స‌ర‌మేంట‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం నెట్టింట జ‌రుగుతుంది.

పైగా స‌మంత ఒక్క‌టే, ఇంకెవ‌రి భాగ‌స్వామ్యం లేకుండా ఒంట‌రిగా ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తుంద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే అనారోగ్యం కార‌ణంగా బ్రేక్ తీసుకున్న స‌మంతకు మ‌ళ్లీ అన్నీ సెట్ చేసుకుని సినిమాల‌కు సిద్ద‌మ‌య్యే టైమ్ కు ఛాన్సులేవీ రాక‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకుందా అని కొంద‌రు అంటున్నారు. ఏదైనా స‌రే స‌మంత రిస్క్ అయితే తీసుకుంది. మ‌రి ఆ రిస్క్ అమ్మ‌డుకి ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :