ASBL NSL Infratech

పుష్ప‌2కు ఇక ప్ర‌తి రోజూ ర‌న్నింగ్ రేసే!

పుష్ప‌2కు ఇక ప్ర‌తి రోజూ ర‌న్నింగ్ రేసే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప‌2. ఈ సినిమా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అంటే ఇవాళ నుంచి స‌రిగ్గా మూడు నెల‌లు మాత్ర‌మే రిలీజ్ కు టైముంది. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పుండ‌ద‌ని మేక‌ర్స్ ప‌దే ప‌దే చెప్తుండ‌టంతో మిగిలిన నిర్మాత‌లంతా ఆ డేట్ ను పుష్ప‌2 కు కేటాయించేశారు.

దీంతో ఇప్ప‌టినుంచి పుష్ప‌2 కు ప్ర‌తీ రోజూ ర‌న్నింగ్ రేసులా ఉండ‌బోతుంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఐటెం సాంగ్ తో పాటూ మ‌రో సాంగ్ కూడా పెండింగ్ ఉంద‌ని యూనిట్ వ‌ర్గాలంటున్నాయి. ఎంతో ఒత్తిడితో ఆఘ‌మేఘాల మీద సుకుమార్ ఈ సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. పుష్ప‌1 టైమ్ లో జ‌రిగిన‌ట్లు హ‌డావిడి లేకుండా ఉండాల‌ని సుకుమార్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే జులై మొద‌టి వారంలోపు పుష్ప‌2 ఫ‌స్ట్ కాపీని రెడీ చేయాలి. ఇంకా ఫ‌హ‌ద్ ఫాసిల్ కు సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉంది. ఆయ‌న కాల్షీట్స్ స‌మస్య వ‌ల్లే షూటింగ్ లేట‌వుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఎంత ఒత్తిడి ఉన్నా రిలీజ్ డేట్ టార్గెట్ ను మిస్ చేయకూడద‌నే సంకల్పంతో పుష్ప‌2 టీమ్ రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంది. జూన్ చివ‌రి వారంలో ట్రైల‌ర్ ను రిలీజ్ చేసి సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తి చేయాల‌నే ఉద్దేశంలో నిర్మాత‌లున్న‌ట్లు తెలుస్తోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :