ASBL NSL Infratech

అప‌రిచితుడుకి అదిరిపోయే ఛాన్స్

అప‌రిచితుడుకి అదిరిపోయే ఛాన్స్

ఈ మ‌ధ్య టాలీవుడ్ లో రీరిలీజుల ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. వాటితో ఆడియ‌న్స్ మొత్తిపోయి వాటిని ప‌ట్టించుకోవ‌డం మానేసినా స‌రే బ‌య్య‌ర్లు మాత్రం ఈ ట్రెండ్ ను ఇప్ప‌ట్లో ఆపేలా క‌నిపించడం లేదు. ఈ నేప‌థ్యంలో మే 17న విక్ర‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న సూప‌ర్ హిట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన అప‌రిచితుడు ని రీరిలీజ్ చేయ‌నున్నారు.

అయితే ఈ సినిమాకు అదృష్టం కలిసొచ్చేలా ఉంది. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి పోస్ట్ పోన్ అవ‌డంతో ఆ రోజు రాజు యాద‌వ్ త‌ప్ప చెప్పుకోద‌గ్గ సినిమా ఏదీ లేదు. ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత ఎంట‌ర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియ‌న్స్ కు మంచి సినిమాలు లేక‌పోవ‌డం అప‌రిచితుడు సినిమాకు క‌లిసొచ్చేలా ఉంది. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్ప‌ట్లో టాలీవుడ్ లో కూడా మంచి హిట్ అయిన విష‌యం తెలిసిందే.

అలాంటి అప‌రిచితుడిని మ‌ళ్లీ థియేట‌ర్లలో చూసి ఫీల‌వ్వ‌డానికి ఎక్కువ శాతం మంది ఇంట్రెస్ట్ చూపించిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. రాజ‌కీయాల నుంచి ఆడియ‌న్స్ ఫోక‌స్ క్ర‌మంగా సినిమాల వైపు వ‌స్తోంది. సరైన ప్లానింగ్ లేక‌పోవ‌డంతో వ‌చ్చే రెండు వారాలు చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ రిలీజ్ కావ‌డం లేదు. దీంతో మే 31న ఏకంగా 5 సినిమాలు పోటీ ప‌డాల్సి వ‌స్తుంది. మొత్తానికి ఎలా చూసుకున్నా రాజు యాద‌వ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ల‌కు అప‌రిచితుడు త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదు కాబ‌ట్టి ఈ రీరిలీజ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చే ఛాన్సుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :