ఏపీ సీఎస్, డీజీపీల కు నోటీసు పంపిన ఈసీ..
సోమవారంతో ఆంధ్రాలో ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపుతో విజయం ఎవరి వైపు ఉంది అన్న విషయంపై స్పష్టత వస్తుంది. కానీ ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలపై ఈసీ బాగా సీరియస్ అయింది. ఈనెల 13న ఆంధ్రాలో పోలింగ్ ముగిసిన తరువాత మరుసటి రోజు పెద్ద ఎత్తున మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి, ఆళ్లగడ్డ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు పరస్పరం దాడులకు ప్రయత్నించాయి. చీఫ్‌సెక్రటరీ, డీజీపీ లు కేవలం రివ్యూలకు పరిమితం అయ్యారని.. క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న ఎన్నికల కమిషన్ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీకి కూడా నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వడం కోసం ఈ ఇద్దరు అధికారులు ఢిల్లీకి రావలసిందిగా ఈసీ కోరింది.