ASBL NSL Infratech

హ్యాపీనెస్-సెంట్రిక్ స్మార్ట్ సిటీస్ ఆవశ్యకతను వెల్లడిస్తున్న ASBL వ్యవస్థాపకుడు శ్రీ అజితేష్ కొరుపోలు

హ్యాపీనెస్-సెంట్రిక్ స్మార్ట్ సిటీస్ ఆవశ్యకతను వెల్లడిస్తున్న ASBL వ్యవస్థాపకుడు శ్రీ అజితేష్ కొరుపోలు

ప్రజల  శ్రేయస్సు మరియు సంతోషానికి ప్రాధాన్యతనిచ్చే పట్టణ ప్రణాళిక అవసరాన్ని ASBL వ్యవస్థాపకుడు & సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు నొక్కి చెప్పారు. ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో, నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి 'హ్యాపీనెస్-సెంట్రిక్' విధానంతో నగరాలు అభివృద్ధి చెందాలని ఆయన చెప్పారు.

పోడ్‌క్యాస్ట్ సందర్భంగా వివిధ కీలక చర్చనీయ అంశాలను శ్రీ కొరుపోలు పరిశీలించారు, పట్టణ ప్రణాళికా విధానాల ప్రస్తుత స్థితి మరియు వాటి అమలుపై అవగాహనా కల్పించే ప్రయత్నం చేశారు. జీవన నాణ్యతను పెంపొందించడంలో పలు అంశాలు మిళితం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన వెల్లడించారు. ఈ తరహా అభివృద్ధి మరింత సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూల పట్టణ వాతావరణాలను ఎలా పెంపొందించగలవనేది ఆయన నొక్కి చెప్పారు. నగర ప్రయాణానికి కారు-కేంద్రీకృత విధానం కంటే నడక కేంద్రీకృత విధానంను నొక్కిచెప్పాల్సిన ఆవశ్యకతను తెలిపారు. గొప్ప నగర-ప్రణాళిక పరంగా అంతగా తెలియని లక్షణం , గొప్ప నడక అనే వాస్తవాన్ని ఆయన వెల్లడించారు.

నగర కేంద్రీకృత జీవనశైలి నేపథ్యంలో గృహ కొనుగోలుదారుల ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ, పట్టణాలలో ఇల్లు కొనుగోలు  చేయాలని చూస్తున్న వ్యక్తుల అభివృద్ధి చెందుతున్న అంచనాలు మరియు కోరికలను శ్రీ అజితేష్ కొరుపోలు చర్చించారు. కనెక్టివిటీ మరియు పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాల యొక్క ప్రాముఖ్యతను ,  ప్రజలకు సంతోషకరమైన జీవనశైలిని రూపొందించడంలో క్రెచ్  సౌకర్యాలు, ఫిట్‌నెస్ జోన్‌లు మరియు సాంఘిక ప్రదేశాలు వంటి సేవలను సులభంగా పొందగలగడం వంటి అంశాలను ఆయన నొక్కి చెప్పారు.

ఈ అంశాన్ని మరింత స్పష్టంగా విశదీకరిస్తూ, ఒకరి మానసిక, శారీరక మరియు సామాజిక ఆరోగ్యంపై ప్రాంగణాలు చూపే ముఖ్యమైన ప్రభావాన్ని శ్రీ అజితేష్ కొరుపోలు హైలైట్ చేశారు. వేగవంతమైన పట్టణీకరణ నేపథ్యం లో, ఒకరి ఆరోగ్యం ను  ప్రభావితం చేసే అనేక ఆధునిక మానవ సమస్యలను పరిష్కరించడానికి పట్టణ రూపకల్పన సైతం వ్యాప్తి చెందాల్సిన  అవసరం ఉందన్నారు.

హైదరాబాద్ స్మార్ట్ సిటీ సామర్థ్యాన్ని వెల్లడి చేయటం లో  జరుగుతున్న పురోగతిని శ్రీ కొరుపోలు అంచనా వేస్తూ , స్మార్ట్ సిటీని నిర్మించడంలో నాణ్యత మరియు సామర్థ్యం రెండింటిలోనూ సవాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రాథమిక పునాది వేసినందుకు పట్టణ సంస్థలను శ్రీ కొరుపోలు అభినందించారు. స్మార్ట్ మరియు హ్యాపీనెస్-సెంట్రిక్ సిటీ పూర్తి దృక్పథాన్ని గ్రహించేందుకు, పాలక సంస్థలు, డెవలపర్‌లు మరియు ప్రజల మధ్య సహకారం మెరుగుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సహకార ప్రక్రియలు మరింత నివాసయోగ్యమైన నగరాలను సృష్టించే ప్రయత్నంలో ప్రజల సంపూర్ణ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయి.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :