ASBL NSL Infratech

ఇండియ‌న్2 కోసం మ‌రో కొత్త రిలీజ్ డేట్

ఇండియ‌న్2 కోసం మ‌రో కొత్త రిలీజ్ డేట్

ఇండియ‌న్2 కోసం మ‌రో కొత్త రిలీజ్ డేట్త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ కాంబోలో తెర‌కెక్కుతున్న ఇండియ‌న్2 కొత్త రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని స‌మాచారం. జులై 12న రిలీజ్ చేస్తే బావుంటుంద‌నుకుని దాన్నే ఫిక్స్ చేయొచ్చంటున్నారు. ఇంకా అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు. నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ డిస్క‌స్ చేసుకుని అంతా ఓకే అనుకున్నాకే అనౌన్స్ చేయ‌నున్నారు.

ఎల‌క్ష‌న్స్ హీట్ పూర్తిగా త‌గ్గాక రిలీజ్ చేస్తేనే బావుంటుద‌నే ఉద్దేశంతో ఈ డేట్ ను అనుకున్నార‌ట‌. ఈ విష‌యం రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇండియ‌న్2 రిలీజైతే కానీ శంక‌ర్ పూర్తి స్థాయిలో గేమ్ ఛేంజ‌ర్ కు టైమ్ ను కేటాయించ‌లేడు. ఆ సినిమాకు సంబంధించిన చాలా ప‌నులు పెండింగ్ లో ఉన్నాయి. గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఇప్ప‌టికీ హైద‌రాబాద్ లో జ‌రుగుతూనే ఉంది.

అందుకే దిల్ రాజు ఇప్ప‌టివ‌ర‌కు గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయ‌లేదు. ఇండియ‌న్2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే త‌ప్ప శంక‌ర్ ఏం మాట్లాడ‌న‌ని చెప్ప‌డంతో రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ లేకుండా పోతుంది. అస‌లు గేమ్ ఛేంజ‌ర్ ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా వాయిదా ప‌డుతుందా అనే అనుమానులు కూడా ఫ్యాన్స్ కు వ‌స్తున్నాయి. అందుకే ఇండియ‌న్2 త్వ‌ర‌గా రిలీజ్ అవాల‌ని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :