ASBL NSL Infratech

కర్నాటకలో 'సెక్స్ స్కాండల్స్' ప్రకంపనలు..

కర్నాటకలో 'సెక్స్ స్కాండల్స్' ప్రకంపనలు..

సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఎన్డీఏ కూటమికి.. హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అసభ్యకర వీడియోల వ్యవహారం దడపుట్టిస్తోంది. ముఖ్యంగా జేడీఎస్‌ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. మరోవైపు ఆ పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీకి ఇది ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ పార్టీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ వస్తోంది. మరోవైపు ఈ అంశం కూటమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందోనని ఇరు పార్టీల నేతలు ఆందోళనలో ఉన్నారు.

నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఉత్తర కర్ణాటకలో మే7న పోలింగ్ జరగనుంది. ఇలాంటి సమయంలో రేవన్న వీడియోల వ్యవహారం విపక్షానికి అందివచ్చిన అస్త్రంలా మారింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలో ప్రచారాస్త్రం చేసేసింది. ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో..కూటమికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దక్షిణ కర్ణాటకలో పోలింగ్‌కు ముందు ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించి ఉంటే.. దీని పరిణామాలు వేరేవిధంగా ఉండేవని చెబుతున్నారు.

మరోవైపు ఈ వ్యవహారం నుంచి మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి దూరం జరిగారు. అది పూర్తిగా రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన అంశమన్నారు. దానితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ.. దీన్ని కుట్రగా కొట్టిపారేశారు. వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటి మార్ఫింగ్ చేసిన వీడియోలన్నారు.

ప్రజ్వల్‌ సస్పెన్షన్..!

మరోవైపు ప్రజ్వల్ పై సస్పెన్షన్ వేటేసింది జేడీఎస్.తప్పు ఎవరు చేసినా శిక్ష ఎదుర్కోవాల్సిందేనన్నారు జేడీఎస్ ఉన్నతస్థాయి నేతలు.. తాము ఎవరినీ రక్షించడం లేదని చెప్పారు. దీనిపై సిట్‌ ఏర్పాటుచేశారని.. నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

లైంగిక దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణలపై హొళెనరసీపుర పోలీసుస్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హాసన్ జిల్లాలో వైరల్‌ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ నాగలక్ష్మి చౌదరి సిఫార్సు మేరకు ఈ అంశంపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :