ASBL NSL Infratech

అనుప‌మ‌కు ఛాన్సులే ఛాన్సులు

అనుప‌మ‌కు ఛాన్సులే ఛాన్సులు

టిల్లు స్వ్కేర్ స‌క్సెస్ అనుప‌మ కు ఎక్క‌డ లేని జోష్ ను తీసుకొచ్చిది. సినిమా రిలీజ్ కు ముందు అనుప‌మ అన‌వ‌స‌రంగా ఇలాంటి క్యారెక్ట‌ర్ చేసింద‌ని ర‌కర‌కాల కామెంట్స్ వినిపించాయి కానీ రిలీజ్ త‌ర్వాత త‌న నిర్ణ‌యం ఎంత స‌రైన‌దో టిల్లు స్వ్కేర్ రిజ‌ల్ట్ ప్రూవ్ చేసింది. యాక్టింగ్ కు లోటు లేక‌పోయిన‌ప్ప‌టికీ గ్లామ‌ర్ షో కు నో చెప్తూ వ‌చ్చిన అనుప‌మకు ఇప్పుడు టిల్లు స్వ్కేర్ త‌ర్వాత తెగ ఆఫ‌ర్లొస్తున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌శాంత్ వ‌ర్మ ఆక్టోప‌స్ లో కీల‌క పాత్ర చేస్తున్న అనుపమ‌, పుస్త‌కాల బండి ఫేమ్ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ప‌ర‌దాలో కూడా లీడ్ రోల్ లో న‌టిస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఛాన్స్ కొట్టేసింద‌ని తెలుస్తోంది. ఈ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ కు కిష్కింద‌పురి అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ట‌.

టాలీవుడ్ లోనే కాదు మ‌ల‌యాళంలో కూడా అనుప‌మ చేస్తున్న జెఎస్‌కెని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. సైరెన్ లో అనుప‌మ చేసింది కామియో కావ‌డం వ‌ల్ల ఆ సినిమాలో ఎక్కువ క్రెడిట్ కీర్తి సురేష్‌కే వెళ్లింది. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ స‌క్సెస్ అనుప‌మ కెరీర్ ను మార్చేసింది. అస‌లే టాలీవుడ్ లో హీరోయిన్ల కొర‌త ఉన్న టైమ్ లో అనుప‌మ లాంటి వాళ్లు మ‌ళ్లీ అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం శుభ సూచిక‌మే.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :