ASBL NSL Infratech

ఉద్యోగులపై గూగుల్ మరోసారి వేటు

ఉద్యోగులపై గూగుల్ మరోసారి వేటు

గూగుల్‌ మరోసారి ఉద్యోగాల కోత పెట్టింది. ఖర్చులను తగ్గించుకునే కారణాలనూ చూపుతూ కంపెనీ చాలా శాఖల నుంచి ఉద్యోగులను తొలగిస్తోంది. తాజాగా సుందర్‌ పిచాయ్‌ నేతృత్వంలోని ఆల్ఫాబెట్‌ మొత్తం పైథాన్‌ టీమ్‌ను తొలగించిందని నివేదికలు చెబుతున్నాయి. వారి జీతాలు ఎక్కువగా ఉన్న కారణంగానే గూగుల్‌ తన పైథాన్‌ బృందాన్ని తొలగించింది. బదులుగా ఇప్పుడు అమెరికా బయట తక్కువ  వేతన ఉద్యోగులతో ఈ బృందాన్ని భర్తి చేయనున్నారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో కొత్త జట్టును ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడ వారు తక్కువ వేతనాలతో ఉద్యోగులను నియమించుకోనున్నారు. రెండు దశాబ్దాలుగా  గూగుల్‌లో పనిచేస్తున్న గూగుల్‌ ఫైథాన్‌ బృందంలోని మాజీ సభ్యుడు తొలగింపుల కారణంగా అతను చాలా నిరాశకు గురయ్యాడు. మరో ఉద్యోగి మేనేజర్‌తో సహా మొత్తం టీమ్‌ను తొలగించినందుకు చాలా చింతిస్తున్నామన్నాడు. గూగుల్‌ రియల్‌ స్టేట్‌,  ఫైనాన్స్‌ విభాగాలలో కూడా తొలగింపులు చేసింది. గూగుల్‌ ఫైనాన్స్‌ చీఫ్‌ రూత్‌ పోరాట్‌ కంపెనీ పునర్నిర్మాణం చేస్తోందని ఉద్యోగులకు ఇమెయిల్‌ ద్వారా తెలియజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :