ASBL NSL Infratech

నాటా మహాసభలకు వెళుతున్న లక్ష్మీపార్వతి

నాటా మహాసభలకు వెళుతున్న లక్ష్మీపార్వతి

ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఫిలడెల్పియాలో నిర్వహిస్తున్న మహాసభలకు హాజరుకావాల్సిందిగా ఉమెన్స్‌ ఫోరం కమిటీ ఆహ్వానంమేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళుతున్నారు. పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా వేదికగా నాటా మహాసభల్లో నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి ఆమె హాజరవుతారు. అక్కడ నుంచి ఈ నెల 10న డెట్రాయిట్‌ చేరుకుని అక్కడ ట్రాయి అసోసియేషన్‌ వారిని కలుస్తారు. 15న తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ వారు ఏర్పాటు చేసే ఓ కార్యక్రమం లో పాల్గొంటారు. అక్కడ ఎన్టీఆర్‌ బయోగ్రఫీ ఫస్ట్‌పార్ట్‌ పుస్తకాన్ని విడుదల చేస్తారు. తర్వాత వాషింగ్టన్‌ డీసీలో వైఎస్సార్‌సీపీ నేత రమేశ్‌ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.

 

Tags :