ASBL NSL Infratech

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫిరెన్స్ కు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫిరెన్స్ కు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ ఆటా కాన్ఫరెన్స్ 2024 జూన్ 7, 8, 9 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు కలిసి ఆటా కాన్ఫరెన్స్ కు ఆహ్వానించారు. ఈ రోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీయం రేవంత్ రెడ్డి నివాసంలో ఆటా సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటా కాన్ఫరెన్స్ కు హాజరై తమ సందేశాన్ని వినిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ అడ్వజర్ చైర్ గౌతమ్ గోళి, 18వ ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బోద్దిరెడ్డి, కల్చరల్ చైర్ నిలిమ గడ్డమానుగు, పోలిటికల్ చైర్ రమణ బత్తుల హజరైయ్యారు. 

అమెరిక తెలుగు అసోసియేషన్ (ఆటా) 18వ కాన్ఫరెన్స్ కు ప్రభుత్వం తరఫున ఐటి శాఖ మంత్రి శ్రీ  శ్రీధర్ బాబు, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటెల్ రమేష్ రెడ్డిలను పంపిస్తామని ముఖ్య మంత్రి  హామి ఇచ్చారు.

 

 

Tags :