ASBL Koncept Ambience
facebook whatsapp X

నారా రోహిత్ 'ప్రతినిధి 2' రిలీజ్ ట్రైలర్ విడుదల

నారా రోహిత్ 'ప్రతినిధి 2' రిలీజ్ ట్రైలర్ విడుదల

నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి 2, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే  టీజర్, థియేట్రికల్ ట్రైలర్‌తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసింది. మరో రెండు రోజుల్లో మే 10న సినిమా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకున్నావ్ ? నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని హీరోని విచారించడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. బాంబు పేలుడులో సీఎం చనిపోగా, ఆయన కుమారుడే ఆ బాధ్యత తీసుకోవాలని రికమండేషన్లు వస్తాయి. ముఖ్యమంత్రి మరణానంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల డ్రామాలని చాలా గ్రిప్పింగ్ గా చూపించారని రిలీజ్  ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
 
థియేట్రికల్ ట్రైలర్ కంటే రిలీజ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ గా ఉంది. సినిమా కంటెంట్ గురించి మరింత రివిల్ చేసింది. నారా రోహిత్ మరో ఎజెండా ఉన్న జర్నలిస్ట్‌గా డాషింగ్‌గా కనిపించారు. దర్శకుడు మూర్తి తన అద్భుతమైన కథనంతో కట్టిపడేశారు.

ఈ చిత్రంలో సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘు బాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోస్, శ్రీ ముఖ్య పాత్రలలో కనిపించారు.

 నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

రిలీజ్ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :