ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ యాజమాని…ఇక లేరు

ప్రపంచ అతిపెద్ద కుటుంబ యజమాని జియోనా చానా కన్ను మూశారు. మిజొరం రాష్ట్రానికి చెందిన ఆయన వయసు 76 ఏళ్లు. 17వ ఏటా వివాహం చేసుకున్న ఆయనకు, 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు. 14 మంది కోడళ్ల, 33 మంది మనవళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. మొత్తంగా జియోనా కుటుంబంలో 160 మందికిపైనే ఉంటారు. వీళ్లంతా ఇప్పటికే ఉమ్మడి కుటుంబంగా ఉండటం మరొక విశేషం. 100 గదులున్న 4 అంతస్థుల భవనంలో నివాసం ఉంటున్నారు. ఒక్కపూట జోజనానికి 30 కోళ్లు అవసరం అవుతాయట. అంతమంది కుటుంబ సభ్యులున్నా వాళ్లంతా మిలటరీ క్రమశిక్షణతో మెలగడం ఈ కుటుంబం మరో ప్రత్యేకత.