రూ.33 లక్షల జాబ్ ఆఫర్ కానీ… అదృష్టం చేజారింది
కేవలం రెండు రోజుల్లోనే 2,066 లైన్ల ప్రోగ్రామింగ్ కోడ్ రాసి అమెరికా కంపెనీలో రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు ఓ బాలుడు. కానీ జాబ్‌లో చేరలేకపోయాడు. కారణం అతని వయసు 15 ఏళ్లే. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన వేదాంత్ అమెరికాలోని న్యూజెర్సీ యాడ్ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ కోడింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. అద్భుత ప్రతిభ చూపించి జాబ్ సంపాదించాడు. అయితే జాబ్ ఆఫర్ చేసినప్పుడు సంస్థకు వేదాంత్ వయసు తెలియదు. తర్వాత తెలుసుకొని జాబ్ నిరాకరించింది. ఉన్నత చదువులపై దృష్టి సారించాలని, చదువు అయిన తర్వాత తమను సంప్రదించాలని సూచించింది. నిరాశ పడ్దొని కోరింది. వేదాంత్ తల్లి ల్యాప్‌టాప్‌లో ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా ఆ కాంపిటీషన్ గురించి తెలిసి దరఖాస్తు చేశాడు. హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, వర్చువల్ స్టూడియో కోడ్ (2022)తో కాంపిటీషన్లో ప్రోగ్రామ్ రాసినట్లు వేదాంత్ తెలిపారు.






