టీసీఎస్ సంచలన నిర్ణయం.. రానున్న రోజుల్లో
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటిచింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు.






