స్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు శాశ్వతంగా
ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని ప్రకటించింది. దాదాపు ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని తెలిపింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్‌లు రిమోట్‌గా పని చేస్తూనే ఉంటాయని కంపెనీ తెలిపింది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్విగ్గీ గత రెండేళ్లుగా ఈ విధానంలో ప్రొడక్టివిటీ పెరిగిందట. ఈ నేపథ్యంలోనే కంపెనీ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది.
ప్యూచర్ ఆఫ్ వర్క్ విధానం ప్రకారం, కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్ ఫంక్షన్, టెక్నాలజీ వంటి బృందాలు రిమోట్‌గా పని చేస్తాయి. బేస్ లొకేషన్లలో పనిచేసే వారు మాత్రం వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాలని తెలిపింది. అలాగే ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమావేశమవుతాయని కంపెనీ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాలని మేనేజర్లు, ఇతర ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్‌కు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.






