మెటా ఇండియాకు కొత్త బాస్
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటా వైస్‌ప్రెసిడెంట్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేయడంతో మెటా యాజమాన్యం సంధ్యా దేవనాథ్‌ను నియమించింది. 2023 జనవరి 1 నుంచి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ తెలిపారు. మెటా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన తరువాత సంధ్యా దేవనాథన్‌ను మెటా ఇండియా కొత్త హెడ్‌గా నియమించడం విశేషం. 2000లో ఢల్లీి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన సంధ్యా నూతన పదవీ బాధ్యతలనను స్వీకరించేందుకు త్వరలోనే ఇండియాకు రానున్నారు.






