ఆర్బీఐ మరో కీలక నిర్ణయం…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ద్య్రోల్బనాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) కీలక నిర్ణయాలను గవర్నర్ వెల్లడిరచారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది. రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు అనేది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తున్నారు. ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో సహా పలు వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో కార్ల, పర్సనల్, హోం లోన్స్‌పై వడ్డీ కూడా పెరగనున్నది. దీని వల్ల ఈఎంఐలు కూడా పెరుగుతాయి. అయితే పెంచిన వడ్డీ రేట్లను తక్షణం అమలు చేయనున్నట్లు గవర్నర్ తెలిపారు.






