ఆర్బీఐ కీలక నిర్ణయం … త్వరలోనే అమలు
మహాత్మా గాంధీతో పాటు అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటోలతో నోట్లు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలాం, ఠాగూర్ ఫొటోలు (వాటర్ మార్కు) ఉన్న నమూనా నోట్లను ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ సహానీకి పంపించినట్టు తెలిసింది. ఠాగూర్, కలాం ఫోటోలను నోట్లపై ముద్రించాలని ఆర్బీఐలోని అంతర్గత కమిటీ సూచించినట్టు తెలిపింది. దిలీప్ సహాని ఎంపిక చేసిన నోట్లను తుది ఆమోదం కోసం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు సమాచారం.






