దేశంలో పెట్టుబడులు పెట్టండి… దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు
భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ మేరకు పిలుపునిచ్చారు.
విదేశీ ప్రతినిధులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ, ప్రపంచ ఆర్థిక ప్రగతి ఇండియాతో అనుసంధానమై ఉందని చెప్పారు. ఇటీవలి సంక్షోభాల నుంచి భారత్ వేగంగా బయటపడిరదని, దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే ఇందుకు కారణమని అంటూ ఈ నేపథ్యంలో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ప్రగతిని సాధించవచ్చని చెప్పారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని వివరించారు. ఇక్కడున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. భారత్లో సంస్కరణల పర్వం కొనసాగుతుందని మోదీ తెలియజేశారు. దేశంలో పెట్టుబడులు పెట్టండి…
దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు.
భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ మేరకు పిలుపునిచ్చారు.
విదేశీ ప్రతినిధులకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ, ప్రపంచ ఆర్థిక ప్రగతి ఇండియాతో అనుసంధానమై ఉందని చెప్పారు. ఇటీవలి సంక్షోభాల నుంచి భారత్ వేగంగా బయటపడిరదని, దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. భారతీయుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే ఇందుకు కారణమని అంటూ ఈ నేపథ్యంలో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ప్రగతిని సాధించవచ్చని చెప్పారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని వివరించారు. ఇక్కడున్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు సూచించారు. భారత్లో సంస్కరణల పర్వం కొనసాగుతుందని మోదీ తెలియజేశారు.






