Supriya Sule : బీసీ రిజర్వేషన్ల విషయంలో.. రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా: సుప్రియా

ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎప్పుడూ చెప్పలేదని, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మాత్రమే చెప్పారని ఎన్సీపీ ( ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) అన్నారు. ఢల్లీిలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చేపట్టిన ధర్నాకు సుప్రియా సూలే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక కార్యకర్త, జీరో నుంచి సీఎం వరకు ఎదిగారని చెప్పారు. వంచితులు, పీడితుల తరపున రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. దేశంలో తొలిసారి 60 శాతం రిజర్వేషన్లను కరుణానిధి (Karunanidhi) అమలు చేశారు. అంబేడ్కర్ (Ambedkar) మాదిరిగానే కరుణానిధి పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. బీసీ రిజర్వేసన్ల విషయంలో రేవంత్ రెడ్డి పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాంగ్రెస్‌తో శరదపవార్ (Sharad Pawar ) కు మంచి అనుబంధం ఉంది. కాంగ్రెస్‌కు మా పార్టీ అండగా నిలుస్తుంది అని అన్నారు.