Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ కల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri ). అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
కిష్కిందపురి కథ ఎప్పుడు విన్నారు?
-డైరెక్టర్ కౌశిక్ ఈ కథని గత ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. చాలా నచ్చింది. జూలై నుంచి షూటింగు మొదలుపెట్టాము. చాలా ఇంట్రెస్టింగ్ హారర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథ ఇది.
– ఇప్పటివరకు చాలా హారర్ కథలు వచ్చాయి. అయితే ఈ కథ మాత్రం చాలా యూనిక్ గా ఉంటుంది. హారర్ థ్రిల్లర్, హారర్ మిస్టరీ ఈ రెండిటి బ్లెండ్ తో చాలా కొత్త కథ చెప్పా దర్శకుడు. ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్ దాని చుట్టూ ఉండే హారర్ ఎలిమెంట్స్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ రాలేదు.
ఒక నిర్మాతగా మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది?
-ఒక కథ విన్నప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, ఇలాంటి పాయింట్ ఇప్పటివరకు రాలేదనిపిస్తే అలంటి పాయింట్ తో సినిమా చేయాలనే ఆసక్తి కలుగుతుంది. కమర్షియల్, ఫ్యామిలీ కథలకు కాంబినేషన్ చూస్తాం గానీ కిష్కిందపురి లాంటి కథకు మాత్రం అందులో ఉన్న యూనిక్ పాయింట్ ఎమిటనేది చూస్తాము.
ఈ కథ విన్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ సినిమా చూసిన తర్వాత కలిగిందా?
ఖచ్చితంగా. కథ విన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ కలిగిందో సినిమా చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. ఈ సినిమాకి అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. యానిమల్ పుష్ప సినిమాలు చేసిన టెక్నీషియన్స్ మిక్సింగ్ చేస్తున్నారు. రన్ టైం కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. తప్పకుండా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం హారర్ సినిమా చేస్తున్నారు కదా.. ఎలా అనిపించింది?
-సాయి గారు ఎప్పటి వరకు కమర్షియల్ మాస్ సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ కథకి ఆయన పూర్తి న్యాయం చేశారు.
-ఇందులో రెండు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా వున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సీరియస్ హారర్ ఫిల్మ్ గా టర్న్ అవుతుంది.
ఈ సినిమా కోసం భారీ సెట్ వేసినట్టుగా ఉన్నారు?
-దాదాపు రెండు కోట్లతో సెట్ వేయడం జరిగింది. సెట్ వెయ్యడానికే నెల రోజులు సమయం పట్టింది.
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు అజినిష్ లోకనాథ్ అని అనుకున్నారని విన్నాం?
-మా డైరెక్టర్ గారు ముందు అజినిష్ తో ట్రావెల్ అయ్యారు. అయితే ఆయన షెడ్యూల్ కుదరకపోవంతో సాంగ్స్ ని చైతన్ భరత్ తో చేయించాం. రీరికార్డింగ్ కోసం ఒకటి రెండు రీల్స్ ఇచ్చాం. తను చేసింది అద్భుతంగా ఉంది. తననే కంటిన్యూ చేసాం.
మీరు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు రెండిటిని బ్యాలెన్స్ చేసి తీయాలని ఆలోచనలో ఉన్నారా?
-మేము పెద్ద సినిమాలే చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బడ్జెట్లో అవుతాయని తెలిస్తేనే చేయడం ఎవరికైనా మంచిది.
ఈ సినిమా బిజినెస్ ఎలా జరిగింది?
-బిజినెస్ విషయంలో మేము చాలా కంఫర్టబుల్ గా ఉన్నాము.
డైరెక్టర్ కౌశిక్ గురించి?
-కౌశిక్ చాలా మంచి నేరేటర్. కథని చాలా అద్భుతంగా చెబుతాడు. చాలా మంచి మేకర్. మోడరన్ ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ తో సినిమాని తీశారు.
కిష్కిందపురి టైటిల్ గురించి?
కిష్కిందపురి అనే ఒక ఊర్లో జరిగే కతిహ ఇది. అలా ఈ సినిమాకి టైటిల్ పెట్టడం జరిగింది.
అనుపమ గురించి?
-తనకి ఎప్పటినుంచో ఇలాంటి హారర్ కంటెంట్ చేయాలని ఉండేది. ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ తనే. కథ వినగానే ఓకే చెప్పారు. తనకి ఈ సినిమాలో మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ దొరికింది. తన క్యారెక్టర్ అద్భుతంగా వుంటుంది.
భగవంత్ కేసరి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కదా.. ఆ సినిమా చేస్తున్నప్పుడు మీరు ఊహించరా?
-నేషనల్ అవార్డు వస్తుందని అనుకోలేదు గాని అనిల్ ఎప్పుడు కూడా ఆ సినిమా తనకి ప్రత్యేకమైన సినిమా అని చెప్తుండేవాడు. ఒక పెద్ద హీరోతో ఇంత మంచి సందేశాత్మక పాయింట్ తో కమర్షియల్ సినిమా అద్భుతంగా కుదిరిందని అంటుండేవారు. కచ్చితంగా దీనికి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుందని తన నమ్మకం. ఆ నమ్మకం నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది.
కిష్కిందపురి ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది?
-ఈ సినిమా చూసిన ఆడియన్స్ తప్పకుండా మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. విజువల్ , మ్యూజికల్ గా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది.
చాలా షాక్ ఫ్యాక్టర్స్, ఆడియన్స్ భయపడే మూమెంట్స్ చాలా వున్నాయి.
-సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. టెక్నికల్ గా సినిమా టాప్ నాచ్ ఉంటుంది.
సెన్సార్ రిపోర్ట్ ఏమిటి?
-సెన్సార్ ఎలాంటి కట్స్ ఇవ్వలేదు. సీరియస్ హారర్ సినిమాని చాలా ఎంగేజింగ్ గా చేశారు, చాలా బాగుంది అని చెప్పారు
కార్మికుల సమ్మె ఎఫెక్ట్ సంక్రాంతికి రాబోయే మీ సినిమా మీద పడిందా?
-15 రోజుల షూటింగ్ ఎఫెక్ట్ అయింది. అయితే ఆర్టిస్టులందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కొత్త షెడ్యూల్ మొదలైపోయింది. నవంబర్ 15కి సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుంది. సంక్రాంతికి సినిమా వచ్చేస్తుంది.
కిష్కింధపురి ప్రీమియర్స్ వేయాలని ఆలోచన ఉందా?
-దానిపై వర్క్ జరుగుతుంది. సోమవారం ఒక నిర్ణయం తీసుకుంటాం