Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత

టారిఫ్‌ల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ(Modi) గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసించడం.. ఆ వెంటనే మోదీ స్పందించడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఇరుదేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) మాట్లాడారు. అమెరికా ( America) తో భాగస్వామ్యానికి మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో కూడా ఆయనకు బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. అగ్రరాజ్యంతో భారత అధికారుల సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడిరచారు.