గూగుల్ మ్యాప్స్‌లలో సరికొత్త ఫీచర్లు

భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. ద్విచక్రవాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇకపై తాము మ్యాప్స్‌లో చూపించనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ను తొలిసారిగా భారత్‌లోనే ప్రవేశపెడుతున్నట్లు వెల్లడిరచింది. ప్రయాణ మార్గంలో ఎదురయ్యే పైవంతెనలను తెయజేసేందుకు, కార్లవంటి నాలుగు చక్రాల వాహనాలు ఇరుకు మార్గాలోకి వెళ్లకుండా నివారించేందుకు కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.