ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లు పెంచే సంకేతాలిచ్చింది. తాజా ద్వైమాసిక రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఎస్బీఐ 12 నెలల`24 నెలల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.10 వడ్డీ రేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మూడు నుండి ఐదు సంవత్సరాల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉంది.






