అక్కడున్న భారతీయులంతా సురక్షితమే : కేంద్రం

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు బంగ్లా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. అక్కడున్న భారతీయులంతా సురక్షితమే అని ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు ఆ దేశ అంతర్గ వ్యవహారం. అక్కడ 15 వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో 8 వేల మంది విద్యార్థులే. వారంతా సురక్షితంగానే ఉన్నారు. వారికి అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.