రాహుల్ గాంధీ ప్రచారం వేళ… కాంగ్రెస్ కు వరుస షాక్ లు

సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కీలక నేత రామ్‌నివాస్ రావత్ బీజేపీలో చేరారు. హస్తం పార్టీలో మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన భారీగా తరలివచ్చిన తన మద్దతుదారులతో కలిసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భిండ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం గమనార్హం. విజయపుర్ సిటింగ్ ఎమ్మెల్యే అయిన రావత్ గ్వాలియర్`చంబల్ ప్రాంతంలో కీలక నేత.